కార్పొరేషన్‌లో పెరిగిన ఓటర్ల సంఖ్య
● మహిళలు 1,80,546..
పురుషులు 1,67,461
● మొత్తం ఓటర్లు 3,48,051
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తుది ఓటరు జాబితాను కమిషనర్ దిలీప్‌కుమార్ విడుదల చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఓటర్ల సంఖ్య పెరిగింది. కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్‌లలో మొత్తం 3,48,051 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 1,67,461 మంది, మహిళలు 1,80,546 మంది, ఇతరులు 44 మంది ఉన్నారు. గతంలో మొత్తం 3,07,459 మంది ఓటర్లు ఉండగా, తాజాగా విడుదల చేసిన తుది జాబితా ప్రకారం 40,592 మంది ఓటర్లు పెరిగారు. గతంలో పురుష ఓటర్లు 1,48,162 ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 1,67,461కు చేరింది. అలాగే మహిళా ఓటర్లు 1,59,255 మంది కాగా ప్రస్తుతం ఆ సంఖ్య 1,80,546కు చేరింది. గతంలో ఇతరులు 42 మంది ఉండగా ప్రస్తుతం 44 మంది ఉన్నారు.


