కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత

Jan 13 2026 5:47 AM | Updated on Jan 13 2026 5:47 AM

కాంగ్

కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత

బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌: కాంగ్రెస్‌ పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారని, రోజురోజుకూ ఆ పార్టీపై వ్యతిరేకత పెరుగుతోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కా ర్యాలయంలో సోమవారం నిర్వహించిన స మావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్‌ ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్‌ వైఫల్యానికి నిద ర్శనమన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని, బీజేపీ మాటలకే పరిమితమైందన్నారు. ప్ర జలు ఇప్పటికీ కేసీఆర్‌వైపే ఉన్నారని పేర్కొన్నారు. పదేళ్లలో నిజామాబాద్‌ అర్బన్‌లో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు. గడపగడపకూ వెళ్లి పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, మాజీ మేయర్‌ నీతూకిరణ్‌, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, వీజీగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇన్‌చార్జి డీఎఫ్‌వోగా సుశాంత్‌ సుఖ్‌దేవ్‌

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లా అటవీ శాఖ ఇన్‌చార్జి డీఎఫ్‌వోగా నిర్మల్‌ డీఎఫ్‌వో సుశాంత్‌ సుఖ్‌దేవ్‌ బాధ్యతలు చేపట్టారు. సోమవారం జిల్లా కార్యాలయంలో బాధ్యతలు చేపట్టగా ఎఫ్‌డీవోలు, ఎఫ్‌ఆర్వోలు ఆయనకు పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. రెగ్యులర్‌ డీఎఫ్‌వోగా ఉన్న వికాస్‌ మీనా ఎంసీటీ ట్రైనింగ్‌ కోసం డెహ్రడూన్‌కు వెళ్లారు. ఆయ న ఫిబ్రవరి 5వ తేదీన తిరిగి రానున్నారు. వికాస్‌ మీనా వచ్చే వరకు సుఖ్‌దేవ్‌ నిజామాబాద్‌ డీఎఫ్‌వోగా పని చేయనున్నారు.

రౌడీషీటర్‌ జిల్లా బహిష్కరణ

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని ఆటోనగర్‌కు చెందిన రౌడీషీటర్‌ బర్సాత్‌ అమేర్‌ను జిల్లా బహిష్కరణ చేసిన పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. సదరు రౌడీషీటర్‌పై 22 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఆరు సంవత్సరాలుగా నేరాలకు పాల్పడుతుండగా, ఇదివరకే పీడీ యాక్ట్‌ విధించినట్లు తెలిపారు. చా లాసార్లు జైలుకు వెళ్లివచ్చినా అమేర్‌ ప్రవర్తనలో మార్పు రావడం లేదని పేర్కొన్నా రు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం వచ్చే మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏడాదిపాటు జిల్లా బహిష్కరణ చేసినట్లు తెలిపారు.

పోలీస్‌ ప్రజావాణికి

35 ఫిర్యాదులు

నిజామాబాద్‌ అర్బన్‌: పోలీస్‌ ప్రజావాణికి 35 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులను స్వీ కరించిన సీసీ సాయిచైతన్య తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీసులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయా లని సీపీ సూచించారు.

కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత 1
1/3

కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత

కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత 2
2/3

కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత

కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత 3
3/3

కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement