మున్సిపోల్స్‌కు సిద్ధం
● వార్డులవారీగా ఓటర్ల జాబితా విడుదల
● కార్పొరేషన్‌తోపాటు మూడు
మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే అధికం
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తుది ఓటరు జాబితా విడుదలైంది. జిల్లాలోని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీలకు సంబంధించి ఓటరు జాబితాను కమిషనర్‌లు సోమవారం వార్డులవారీగా విడుదల చేశారు. తుది జాబితా ప్రకారం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది.


