మున్నూరుకాపులు రాజకీయంగా ఎదగాలి..
● ధర్మపురి సంజయ్
నిజామాబాద్ రూరల్: మున్నూరుకాపులు రాజకీయంగా ఎదగాలని మాజీ మేయర్, మున్నూరుకా పు జిల్లా సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ అ న్నారు. నగరంలోని మున్నూరుకాపు కల్యాణమండపంలో ఆదివారం మున్నూరుకాపు జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఇటీవల గెలుపొందిన సంఘ స ర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మాన కా ర్యక్రమం నిర్వహించారు. అంతకుముందు సంఘ ప్రతినిధులు నగరంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ.. జిల్లాలో 450 పైచిలుకు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లుగా మున్నూరుకాపులు గెలవడం గొప్ప విషయమన్నారు. మున్నూరుకాపులకు ఏ కష్టం వచ్చి నా నేనున్నానని మర్చిపోవద్దన్నారు. ఉర్దూ అకాడ మీ చైర్మన్ తాహెర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మేయర్ ఆకుల సుజాత, సురేందర్, గంగాధర్, చిన్నరాజేశ్వర్, బలరాం, శ్రీశైలం, రాజశేఖ ర్, రవీందర్, పోతన్న, సాయిలు పాల్గొన్నారు.


