దంపతులకు గాయాలు
కారును ఢీకొన్న కంటైనర్
భిక్కనూరు: మండల కేంద్రం సమీపంలో కారును కంటైనర్ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న దంపతులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పద్మ, మోహన్‌రెడ్డి దంపతులు ఆదివారం కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. మండల పరిధిలోని వజ్రా గ్రానైట్ ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారిపై వారి కారును వెనుకనుంచి వచ్చిన కంటైనర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈఘటనలో కారులో ఉన్న పద్మ, మోహన్‌రెడ్డి దంపతులకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు.


