ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం
● 250 మంది సంగీత కళాకారుల
కీర్తనల ఆలాపన
● అలరించిన చిన్నారుల నాట్యప్రదర్శన
బోధన్: పట్టణంలోని శక్కర్‌నగర్ రామాలయంలో ఆదివారం కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు, స్వరకర్త త్యాగరాజస్వామి మూడో ఆరాధనోత్సవాలు కనుల పండువగా నిర్వహించారు. శక్కర్‌నగర్ ప్రాంతానికి చెందిన ప్రతాప రామకృష్ణయ్య, అన్నపూర్ణ దంపతుల కుమారులు ప్రతాప శ్రీనివాస్, పీజీఎస్ శాసీ్త్ర అధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా వారు ముందుగా జ్యోతిప్రజ్వలన, త్యాగరాజస్వామి చిత్రపటానికి పూజలు చేశారు. అనంతరం త్యాగరాజ కీర్తనల సంగీత కచేరి ప్రారంభించారు. డాక్టర్ స్వప్న నేతృత్వంలో వివిధ ప్రాంతాలకు చెందిన 250 మంది సంగీత కళాకారులు త్యాగరాజస్వామి స్వరపర్చిన పంచకృతులు ఆలపించారు. నాట్యతరంగిణి సంస్థ నిర్వాహకులు కర్ణం శ్రీనివాస్ వారి విద్యార్థినులు, చిన్నారులు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి విశేషంగా ఆకట్టుకున్నారు. అతిథులు, సంగీత కళాకారులు, నృత్య ప్రదర్శనలిచ్చిన విద్యార్థినులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం
ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం


