క్రైం కార్నర్
మేసీ్త్రల మధ్య ఘర్షణ: ఒకరి మృతి
మాక్లూర్: ఇద్దరు తాపీ మేసీ్త్రల మధ్య గొడవ జరుగగా, ఘర్షణలో ఒకరు మృతిచెందారు. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా.. మన్నేం లక్ష్మన్‌రావు అనే తాపీమేసీ్త్ర సంవత్సరకాలంగా మెట్‌పల్లి గ్రామంలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటూ శివారు గ్రామాల్లో ఇంటి నిర్మాణ పనులను గుత్తకు పట్టుకుని కొత్త ఇళ్లు నిర్మిస్తుంటాడు. ఏరోజుకు ఆరోజు కూలీలను తెచ్చుకుని పనులు చేయిస్తాడు. ఆదివారం లక్ష్మన్‌రావుకు తనతో పాటు ఉన్న మేసీ్త్ర జలపతిరాజు (60)కు మధ్య కూలీపై పనికి వెళ్లే విషయంలో గొడవ జరిగింది. ఈక్రమంలో లక్ష్మన్‌రావు జలపతిరాజును బలంగా నెట్టివేయడంతో పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మైపె పడ్డాడు. దీంతో అతడి తలకు బలమైన గాయాలు కావటంతో స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతుడి కుమార్తె శివాని ఫిర్యాదు మేరకు లక్ష్మన్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
నిజాంసాగర్(జుక్కల్): సంగారెడ్డి జిల్లా మాసాపల్లికి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్ట ర్లను శనివారం రాత్రి ప ట్టుకున్నామని ఎస్సై శివకుమార్ తెలిపారు. మండలంలోని మర్పల్లి గ్రామా నికి చెందిన మూడు ట్రాక్టర్లల్లో మంజీరా నదిలో నుంచి ఇసుక లోడ్ చేసి, పొరుగు జిల్లాకు తరలిస్తుండగా మార్గమధ్యలో పట్టుకున్నామన్నారు. పట్టుబడిన మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి ముగ్గురు వ్యక్తులపైన కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
గంగారాం తండాలో ఒకరి ఆత్మహత్య
ఇందల్వాయి: ఇందల్వాయి మండలం గంగారాం తండాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. గంగారం తండాకు చెందిన షేక్ మహబూబ్ అలీ (48) అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా కొనసాగుతూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా అతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతడు జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య షేక్ రిజ్వానా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
చోరీ కేసులో మహిళ అరెస్టు
నిజామాబాద్ అర్బన్: నగరంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న మహిళను అరెస్టు చేసినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి ఆదివారం తెలిపారు. ఇటీవల రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఓ మహిళ వద్ద నిందితురాలు బంగారాన్ని చోరీ చేసి, పారిపోయిందన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితురాలు కర్ణాటక రాష్ట్రం దీన్‌దయాల్ నగర్ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయ రాణి బాయ్‌గా గుర్తించామన్నారు. అలాగే ఆమె వద్ద నుంచి నాలుగు తులాల రెండు గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకున్నామన్నారు.
క్రైం కార్నర్
క్రైం కార్నర్


