సర్పంచులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి
నిజామాబాద్ రూరల్: గ్రామాల్లో గెలిచిన సర్పంచు లు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని, స్థానిక స మస్యలపై ఎకరువు పెట్టాలని గనులు, కార్మిక ఉపా ధి కల్పన శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నా రు. నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్‌లో ఆదివా రం జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన మాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వా ర్డు సభ్యుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కా ర్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథి హాజరై మాట్లాడారు. పదవులు ఉన్న లేకున్న ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తెలంగా ణ రాష్ట్ర సాధకుడు వెంకటస్వామి(కాక) విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని సర్పంచులను కోరారు. జిల్లావ్యాప్తంగా 64 మంది ఎస్సీ సర్పంచులు, 24 మంది ఉపసర్పంచులు గెలుపొందార న్నారు. రాష్ట్ర రైతుకమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నుడా చైర్మన్ కేశవేణు, మాల మహానాడు జాతీ య అధ్యక్షుడు చిన్నయ్య, జిల్లా అధ్యక్షుడు దేవిదాస్, లింబాద్రి, టీఎన్జీవో నాయకులు కిషన్ ఉన్నారు.
పదవులు ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండాలి
గనులు, కార్మిక ఉపాధి కల్పన శాఖ
మంత్రి వివేక్‌వెంకటస్వామి
నగరంలో మాల మహానాడు,
మున్నూరుకాపు సంఘాల ఆధ్వర్యంలో నూతన సర్పంచులకు సన్మానాలు


