పిల్లలకు పౌష్టికాహారం అందించాలి
నిజామాబాద్‌నాగారం: అంగన్‌వాడికి వచ్చే బాలింతలకు, గర్భిణులకు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ సిబ్బందికి సూచించారు. పిల్లల్లో పోషకాహార లోపం నివారించడానికే జాతీయ పోషణ పక్షం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం ఏడవ జాతీయ పోషణ పక్షం–2025 కార్యక్రమాన్ని జిల్లా సంక్షేమాధికారి షేక్ రసూల్‌బీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ కలెక్టర్ హాజరై మాట్లాడారు. పిల్లల్లో ఉబకాయాన్ని తగ్గించాలన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి ఉండే విధంగా చూసుకోవాలన్నారు. జిల్లా ఆయుష్ కో–ఆర్డినేటర్ సాయగౌడ్, డీఎంహెచ్‌వో రాజశ్రీ, అధికారులు పాల్గొన్నారు.
మెడికల్ షాపు లైసెన్స్ రద్దు
నిజామాబాద్‌నాగారం: నగరంలోని ఖలీల్‌వాడీలో ఉన్న గిరిజా మెడికల్ దుకాణం లైసెన్సును రద్దు చేసినట్లు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ బుధవారం తెలిపారు. మెడికల్ దుకాణంలో ఫార్మసిస్టు, రికార్డులు లేకపోవడం, ఎప్పటికప్పుడు రోజువారీగా నమోదు చేయాల్సిన బిల్స్ కూడా ప్రాపర్‌గా నమోదు కాకపోవడాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతోనే లైసెన్సును రద్దు చేసి తాత్కాలికంగా మెడికల్ షాపును మూసివేసినట్లు తెలిపారు.
పిల్లలకు పౌష్టికాహారం అందించాలి


