రాజ్యాంగ స్ఫూర్తితో అభివృద్ధి దిశగా పయనం
నిజామాబాద్ అర్బన్: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తితో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తోందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలకు రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఫులాంగ్ చౌరస్తా వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగం ఆధారంగానే ప్రస్తుతం శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు పని చేస్తున్నాయని, అందరికీ సమాన హక్కులు, సంక్షేమ ఫలా లు అందుతున్నాయన్నారు. సమానత్వం, సామాజిక న్యాయంతోపాటు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం, ఆయన విలువల ఆధారంగానే జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ అంకిత్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంతోనే సమా జంలో ప్రతి ఒక్కరూ హక్కులు, బాధ్యతలు, పదవులను చేపట్టగలుతున్నారని అన్నారు. మహనీయుని ఆశయ సాధన కోసం అంకితభావంతో కృషి చేయా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిణి నిర్మల, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు


