మోర్తాడ్ ముందుంది
త్వరలో అవార్డులు
మోర్తాడ్‌కు రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానం దక్కడంతో ప్రత్యేకాధికారికి, కార్యదర్శికి, ఎంపీడీవోకు అవార్డులను అందించే అవకాశం ఉంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అవార్డులను త్వరలోనే అందించే అవకాశం ఉందని పంచాయతీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను మోర్తాడ్‌కు అవార్డు దక్కగా అప్పట్లో సర్పంచ్‌లు ఉన్నారు. మాజీ ప్రజాప్రతినిధులకు కాకుండా అధికారులకే అవార్డులను అందించాలని కేంద్రం నిర్ణయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మోర్తాడ్: కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిర్దేశించిన ప్రకారం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించిన గ్రామంగా మోర్తాడ్ జిల్లాస్థాయిలో వందమార్కులు సాధించి ప్రథమస్థానంలో నిలిచింది. అలాగే రాష్ట్ర స్థాయిలో 81.29 మార్కులతో నాలుగో స్థానంలో నిలవడం విశేషం. 2022–23లో కేంద్ర ప్రభుత్వం పలు అంశాల్లో గ్రామాల అభివృద్ధిపై నివేదికను కో రింది. ప్రతి పంచాయతీతో సెల్ఫ్ అప్రైజల్ రిపోర్టు ను ఆన్‌లైన్‌లో నమోదు చేయించారు. ఇందులో భాగంగానే మోర్తాడ్ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిర్దేశించిన ప్రకారం అన్ని రంగాల్లో మంచి ఫలితాలను సాధించడంతో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి లో సత్తా చాటింది. మౌలిక వసతులు, ప్రజారోగ్యం, పేదరిక నిర్మూలన, చిన్నారులు, మహిళలకు సౌకర్యాలు, పారిశుధ్యం, పచ్చదనం, సామాజిక భద్రత ఇలా అనేక అంశాలపై గ్రామంలోని వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలా రిపోర్టును తయారు చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. జిల్లా స్థాయిలో రిపోర్టులను పరిశీలించి రాష్ట్రస్థాయికి పంపించగా అక్క డ పరిశీలన అనంతరం కేంద్రానికి పంపించారు. రాష్ట్ర స్థాయిలో 25 గ్రామ పంచాయతీలకు చోటు దక్కగా అందులో మోర్తాడ్‌కు నాలుగో స్థానం లభించడం గమనార్హం. మోర్తాడ్ జిల్లా స్థాయిలో వంద మార్కులను సాధించింది. రాష్ట్ర స్థాయిలో మాత్రం 81.29 మార్కులను పొందింది.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించిన గ్రామంగా వంద మార్కులు
జిల్లా స్థాయిలో ప్రథమ..
రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానం
అవార్డు అందించనున్న
కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ
మా శ్రమకు గుర్తింపు లభించింది
జిల్లా స్థాయిలో మోర్తాడ్ వంద మార్కులు, రాష్ట్ర స్థాయి లో 81.29 మార్కులతో నా లుగో స్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. మా శ్ర మకు గుర్తింపు లభించింది. గ్రామంలో సుపరిపాలన ఇతర అంశాల విషయంలో ప్రజలు, అధికారుల సహకారంతో ముందుకు సాగాం. అవార్డు లభించినందుకు సంతృప్తిగా ఉంది. – భోగ ధరణి, మాజీ సర్పంచ్, మోర్తాడ్
మోర్తాడ్ ముందుంది


