ఆర్టీసీ సిబ్బందికి ‘ప్రగతి చక్రం’ పురస్కారాలు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ‘ప్రగతి చక్రం‘ పురస్కారాలను అందజేసినట్లు ఆర్‌ఎం జ్యోత్స్న మంగళవారం తెలిపారు. ఉత్తమ సిబ్బందికి త్రైమాసిక పురస్కారాలను అందజేశామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎం ఎస్ మధుసూదన్, డిపో మేనేజర్లు, పర్సనల్ ఆఫీసర్, సూపర్ వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి ఉషూలో కాంస్య పతకం
నిజామాబాద్‌నాగారం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లో గత నెల 24 నుంచి 28వ తేదీ వరకు జాతీయ ఉషూ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో నగరంలోని కేర్ డిగ్రీ కళాశాల విద్యార్థి బిలాల్ కాంస్య పతకం సాధించాడు. తెలంగాణ తరఫున సీనియర్ స్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించిన బిలాల్‌ను కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్, ప్రిన్సిపల్ బాలకృష్ణ సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించడంలో తమ కళాశాల ఎప్పుడూ ముందుంటుందన్నారు. క్రీడాకారులకు సహాయసహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బిలాల్ కళాశాల యాజమాన్యానికి బిలాల్ కృతజ్ఞతలు తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ నరేశ్, కళాశాల ప్రతినిధులు కొయ్యాడ శంకర్, సందేశ్, సందీప్ పాల్గొన్నారు.
వీడీసీపై చర్యలు తీసుకోవాలి
ఖలీల్‌వాడి: ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ వీడీసీపై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామానికి చెందిన గౌడకులస్తులు పెద్దసంఖ్యలో పోలీస్ కమిషనరేట్‌కు తరలివచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పాత ఎంపీడీవో కార్యాలయం నుంచి సీపీ కార్యాల యం వరకు జిల్లా గౌడ సంఘం, జిల్లా యు వజన గౌడ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ ని ర్వహించగా, తాళ్ల రాంపూర్‌కు చెందిన మ హిళలు, గౌడకులస్తులు పాల్గొని సీపీ కార్యాలయం గేటు వద్ద బైటాయించారు. తాళ్లరాంపూర్ వీడీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. శ్రీరామనవమి సందర్భంగా కుంకు మార్చనకు వెళ్లిన తమను ఆలయం నుంచి బయటికి పంపించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. అనంతరం గౌడ కులస్తులు మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా గ్రామంలో కల్లు తాగేందుకు ఎవరూ రావడం లేదన్నారు. దీంతోపాటు వీడీసీ సభ్యులు గౌడకులస్తులను లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ట్లు చెప్పారు. రామా గౌడ్, సుదర్శన్, సతీశ్, సత్యనారాయణగౌ డ్, సారా సురేశ్, దేగాంయాదగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులు వేధిస్తున్నారు
నిజామాబాద్ రూరల్: ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరుతో వ్యాపారులను అధికారులు వేధిస్తున్నారని, నోటీసులు ఇవ్వకుండా ఇష్టం వ చ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నారని చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఆరోపించారు. హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా అధికారులు వేధిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కు చాంబర్ అధ్యక్షుడు రావులపల్లి జగదీశ్వర్‌రావు నేతృత్వంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల ఐడెంటిటీ స ర్టిఫికెట్ చూయిస్తే హై కోర్టు ఆర్డర్ ప్రకారం ప్రస్తుతానికి ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు చేయబోమని స్పష్టం చేశారు. కమిషనర్‌ను కలిసిన వారిలో కార్యదర్శి కమల్ ఇనాని, ని శిత రాజు, మోహన్‌రెడ్డి, భక్తవత్సలం, శ్యా మ్ అగర్వాల్, వెంకటగౌడ్, దినేశ్‌రెడ్డి, నర్సింహరెడ్డి, శ్రీనివాసరావు, గంగాధర్‌రా వు, జమీల్, హరి ప్రసాద్, ప్రసాద్, దాస్, పటేల్, కౌలయ్య, దర్శన్‌సింగ్ ఉన్నారు.
ఆర్టీసీ సిబ్బందికి ‘ప్రగతి చక్రం’ పురస్కారాలు
ఆర్టీసీ సిబ్బందికి ‘ప్రగతి చక్రం’ పురస్కారాలు
ఆర్టీసీ సిబ్బందికి ‘ప్రగతి చక్రం’ పురస్కారాలు


