సుభాష్‌నగర్: అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఇందూరు పసుపునకు కూడా జియో ట్యాగింగ్ భౌగోళిక గుర్తింపు తీసుకురావాలని జేఎంకేపీఎం డైరెక్టర్ పాట్కూరి తిరుపతిరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామ సరిహద్దు ప్రాంతాల్లో పండించే చపాట మిర్చికి జియో ట్యాగింగ్ భౌగోళిక గుర్తింపు రావడం చాలా సంతోషకరమైన విషయమని ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా జిల్లాలో పండే పసుపునకు కూడా అంతర్జాతీయ భౌగోళిక గుర్తింపు కోసం ఫిబ్రవరిలో ఉద్యానవన శాఖ ద్వారా దరఖాస్తు చేశామన్నారు. భౌగోళిక గుర్తింపు వస్తే ఇక్కడి పసుపు రైతులకు కూడా మంచి రోజులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. తిమ్మంపేట్ మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో భౌగోళిక గుర్తింపు కోసం కృషి చేసిన సంఘం అధ్యక్షుడు రాజ్‌కుమార్‌రెడ్డితోపాటు ప్రతిఒక్కరికి పసుపు రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


