సిరికొండ: ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజీ 21, 22 పనులను రెండేళ్లలో పూర్తి చేయించి మండలానికి సాగు నీరందిస్తానని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. సిరికొండ మండలం మెట్టుమర్రి తండా, గడ్డమీది తండా, కొండాపూర్, గోప్య తండా, గడ్కోల్, హు స్సేన్‌నగర్, తాళ్లరామడుగు గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లను, గడ్కోల్‌లో రూ. మూడు కోట్లతో విస్త రించిన డబుల్ రోడ్డును, రూ. 12 లక్షలతో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించా రు. గడ్కోల్ కప్పలవాగుపై రూ.2.46 కోట్ల తో ని ర్మించనున్న చెక్‌డ్యాం, లొంక రోడ్డులో రూ. మూడు కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు, కొండాపూర్ వడ్డెర కాలనీ నుంచి కార్నర్ తండా వరకు రూ. రెండున్నర కోట్లతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దివంగత వైఎస్సార్ హ యాంలో 90 శాతం పూర్తయిన మంచిప్ప ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండా గత ప్రభుత్వం రీడిజై న్ పేరిట పైపులైన్లు అంటు కాలయాపన చేసింద న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేస్తూ పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తోందని అన్నారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన బీసీ బిల్లుకు కేంద్రం మోకాలడ్డుతోందని విమర్శించారు. కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ ము ప్ప గంగారెడ్డి, శేఖర్‌గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్కోల్ భాస్కర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు బాకా రం రవి, గొల్ల ఎర్రన్న, చందర్‌నాయక్, సొసైటీ చైర్మన్ గంగాధర్, ఏఎంసీ డైరెక్టర్లు సంపత్‌రెడ్డి, ముత్తెన్న, దేగాం సాయన్న, భానుచందర్, బాల్‌సింగ్, సంతోష్, కుందేళ్ల శ్రీనివాస్, జగన్, శ్రీధర్, సంతోష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
పలు అభివృద్ధి పనులకు భూమిపూజ


