త్వరలో ‘కార్బన్ క్రెడిట్ సర్వే’
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో త్వరలో ‘కార్బన్ క్రెడి ట్ సర్వే’ను అధికారులు చేపట్టనున్నారు. హరితహారం, వన మహోత్సవం కార్యక్రమాల్లో భాగంగా నాటిన మొక్కల కారణంగా నేలకు, గాలికి ఎంత మేలు జరిగిందో తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రయత్నం చేస్తోంది. న్యూ ఢిల్లీకి చెందిన ఐవో ఆర్‌ఏ అనే ప్రైవేట్ సంస్థ ద్వారా సర్వే చేపట్టనుండగా ఇందులో ఉపాధిహామీ ఉద్యోగులను భాగస్వాములను చేశారు. జిల్లాకు చెందిన ఐదుగురు ఉ ద్యోగులకు ఇటీవల శిక్షణ కూడా పూర్తయింది. శిక్ష ణ పొందిన వారు ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీవోలు, ఈసీలు, ప్లాంటేషన్ మేనేజర్, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 15వ తేదీలోగా కార్బన్ క్రెడిట్ సర్వేను ప్రారంభించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది.
2022–23 సంవత్సరం నుంచే..
సర్వే చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గైడ్‌లెన్స్ ఇచ్చింది. 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రస్తుత ఏడాది వరకు జిల్లాలో నాటిన మొక్కలనే సర్వే చేయాలని సూచించింది. ఇందులో పల్లె ప్రకృతి వనాలు, కమ్యూనిటీ ప్లాంటేషన్, పండ్ల తోటలు, పొలం గట్లపై నాటిన మొక్కలు, ప్రభుత్వ ప్రాంగణాలు, అటవీ ప్రాంతాలు ఉన్నాయి. మొక్కలను నాటి వాటిని సంరక్షించిన వివరాలను సేకరించా ల్సి ఉంటుంది. మొక్కలు నాటిన ప్రాంతాల్లో జీపీఎస్ ద్వారా తిరిగి ఎన్ని మొక్కలు నాటారు? ఎన్ని రకాల మొక్కలున్నాయి? వాటి వయసెంత? వీటి కారణంగా కార్బన్ అణువులు భూమిలో, గాలిలో ఎంత శాతం కలిశాయో రికార్డు చేస్తారు.
మూడేళ్లలో 40లక్షల మొక్కలు
గ్రామీణాభివృద్ధి శాఖ గత మూడేళ్లలో 120 రకాల మొక్కలను 40లక్షల వరకు నాటగా అందులో దా దాపు 60 శాతం మొక్కలు బ్రతికే అవకాశాలు న్నాయి. వీటికి మాత్రమే సర్వే నిర్వహిస్తారు. సర్వే వివరాలు యాప్ ద్వారా ఐవోఆర్‌ఏ సంస్థకు చేరుతాయి. సర్వేపై థర్డ్ పార్టీ ఎంకై ్వరీ సైతం చేయనుంది. ఆ తర్వాత మొక్కలు నాటి సంరక్షిస్తున్న యజమానులు, రైతులు, గ్రామ పంచాయతీలకు పారితోషిక నిధులు అందజేసే అవకాశాలున్నాయని డీఆర్‌డీవో సాయాగౌడ్ ‘సాక్షి’కి తెలిపారు.
హరితహారం, వన మహోత్సవం
మొక్కలపై నిర్వహించనున్న
‘ఉపాధి’ ఉద్యోగులు
సంరక్షిస్తున్న వారికి పారితోషిక నిధులు!


