కొనుగోళ్లు వేగవంతం చేయాలి
వర్ని : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. వర్ని మండలంలోని జాకోర, జలాల్‌పూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోళ్లు వేగవంతం చేసి ధాన్యం తడిసిపోకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప రిశీలించి డిజిటల్ యంత్రం సహాయంతో వడ్ల తే మ శాతాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్ల వివ రాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తరలించేందుకు లారీలను అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు రోడ్లపై ధాన్యం ఆరబెట్టకుండా, మైదాన ప్రాంతాల్లో ధాన్యం ఆరబెట్టేలా చైతన్యపరచాలని సూచించారు.
బోర్డులు ఏర్పాటు చేయాలి
జిల్లాలోని చౌకధరల దుకాణాల్లో రేషన్ కార్డులు, లబ్ధిదారుల సంఖ్య, కేటాయించిన బియ్యం ఇతర స్టాక్ వివరాలను తెలిపే నోటీసు బోర్డులను ఏర్పా టు చేసేలా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశించారు. జలాల్‌పూర్ గ్రామంలో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియను ఆయన పరిశీలించా రు. దుకాణానికి బోర్డు లేకపోవడంతో డీలర్‌పై మండిపడ్డారు. బియ్యం పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, బోధన్ ఆర్డీవో సాయాగౌడ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రవీందర్ రెడ్డి, సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీవో శ్రీనివాస్, వర్ని తహసీల్దార్ సాయిలు, ఎంపీడీవో వెంకటేశ్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు


