న్యూస్‌రీల్
కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ
ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు
ఈ నెల 31కి పూర్తి చేసేలా కసరత్తు
వచ్చే నెలాఖరు నాటికి కొత్త పింఛన్లు
నిర్మల్
అందని వైద్యం!
తానూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రోగులకు సరైన వైద్యం అందడంలేదు. వైద్యాధికారి,సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండగా చికిత్స కోసం వస్తున్నవారికి ఇబ్బందులు తప్పడంలేదు.
సీఎంఆర్ కేసులో బాసర నాయకుల అరెస్ట్!
బాసర: ప్రభుత్వ ధాన్యాన్ని రైస్‌మిల్లుల్లో అక్రమంగా విక్రయించారన్న ఆరోపణలపై బాసర గ్రామానికి చెందిన నలుగురిని విజిలెన్స్, సారంగపూర్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో సుమారు రూ.11కోట్ల ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లిందన్న ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న వారిలో బాసర మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు లక్ష్మణరావు, కిర్గుల్ (బీ) మాజీ సర్పంచ్ సుధాకర్‌రెడ్డి, సుధాకర్‌రావు, మల్కన్న యాదవ్ ఉన్నట్లు సమాచారం. వీరిని నిర్మల్‌లోని సబ్‌జైలుకు తరలించినట్లు తెలిసింది. సారంగపూర్ మండలం ధని గ్రామంలోగల రైస్‌మిల్లు ద్వారా ప్రభుత్వానికి సీఎంఆర్ అప్పగించాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా ధాన్యాన్ని విక్రయించారన్న ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. బాసర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే నలుగురు నాయకులు రైస్‌మిల్ కేసులో అరెస్ట్ కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
నిర్మల్‌చైన్‌గేట్: చేయూత పెన్షన్ల మంజూరు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ప్రభుత్వ ఆ దేశాలతో దరఖాస్తులు స్వీకరిస్తూనే ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇ ప్పటివరకు దాదాపు 7వేల వరకు దరఖాస్తులు వ చ్చినట్లు తెలిసింది. దరఖాస్తులన్నీ ఈనెల 31వ తే దీ నాటికి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇందుకు మండల, మున్సిప ల్ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలి టీలతోపాటు గ్రామపంచాయతీల పరిధిలోని దరఖాస్తులను ఎంపీడీవో ఆఫీసుల్లో ఆన్‌లైన్‌లో నమో దు చేస్తున్నారు. మరణించిన లబ్ధిదారుల పేర్లను ప్రత్యేకంగా కేటాయించిన లాగిన్ ద్వారా తొలగించే ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్లు తెలిసింది.
కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
గ్రేడ్–2, గ్రేడ్–3 ఫైలేరియా బాధితులు, ఆరోగ్యశ్రీలో డయాలసిస్ చికిత్స పొందుతున్న వారికి వయోపరిమితి లేకుండా పింఛన్ మంజూరు చేయనున్నారు. వీరిని సంబంధిత వైద్య, ఆరోగ్యశ్రీ విభాగాలు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అర్హులు పంచాయతీ కార్యదర్శి, వార్డు అధికారి లేదా ఎంపీడీవో కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు త్వరలో శుభవార్త అందే అవకాశముంది.
క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టే అవకాశం?
ఈ నెల 31న దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన త ర్వాత అర్హుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. గజిటెడ్ అధికారి పర్యవేక్షణలో క్షేత్రస్థాయి అధి కారులతో కలిసి థర్డ్‌పార్టీ విచారణ చేపట్టే అవకాశముంది. పరిశీలన, విచారణ పూర్తయిన తర్వాత సె ప్టెంబర్ చివరి వారంలో కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశమున్నట్లు సమాచారం. దీంతో అర్హులై న దరఖాస్తుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఈనెల 29వరకు ఆన్‌లైన్ చేసిన దరఖాస్తులు
మండలం మొత్తం వితంతువులు ఒంటరి వికలాంగులు
దరఖాస్తులు మహిళలు
బాసర 255 184 2 67
భైంసా 516 321 31 162
భైంసా (ము) 407 218 36 152
దస్తురాబాద్ 193 83 6 91
దిలావర్‌పూర్ 135 72 2 55
కడెం 470 242 11 195
ఖానాపూర్ 308 168 3 117
ఖానాపూర్ (ము) 194 64 6 100
కుభీర్ 442 243 22 170
కుంటాల 184 98 9 76
లక్ష్మణచాంద 331 184 29 111
లోకేశ్వరం 361 181 25 139
మామడ 326 199 13 101
ముధోల్ 366 247 3 112
నర్సాపూర్(జి) 173 85 4 81
నిర్మల్‌రూరల్ 238 136 0 99
నిర్మల్ (ము) 741 402 17 322
పెంబి 225 154 5 65
సారంగపూర్ 275 147 6 113
సోన్ 292 126 31 131
తానూరు 360 262 0 97
‘పరిషత్’ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు అర్హులు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేలా చొరవ చూపుతున్నారు. అర్హుల ఇళ్లకు వెళ్లి దరఖాస్తు చేయించేందుకు పోటీ పడుతున్నారు. భవిష్యత్‌లో పింఛన్ మంజూరైతే తమ చొరవతోనే వచ్చినట్లు చెప్పుకొని ఓట్లు అభ్యర్థించే అవకాశముంటుందని వారు భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కాగా, అర్హుల ఇళ్లకు వెళ్లిన సమయంలో అర్హత ఉన్నా తమకు వృద్ధాప్య పింఛన్ ఎందుకు రాలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో నాయకులు వారికి సర్దిచెబుతూ అర్హులందరికీ పింఛన్ మంజూరయ్యేలా ప్రయత్నిస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం.
ఆ తర్వాతే ఎంపిక ప్రక్రియ ప్రారంభం
గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు కుటుంబ వార్షికాదాయం కలిగినవారు అర్హులు. కుటుంబానికి మూడెకరాలకు మించి మాగాణి భూమి, 7.5 ఎకరాలకు మంచి మెట్ట భూమి ఉన్నా అనర్హులు. కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ, ప్రైవేట్, వృత్తి నిపుణులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నా ఆ కుటుంబంలోని వారిని ప్రభుత్వం అనర్హులుగా పరిగణించనుంది. కుటుంబంలోని వ్యక్తికి సొంతంగా రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు, కారు ఇతర నాలుగు చక్రాల వాహనాలున్నా పింఛన్ పొందేందుకు అనర్హులని నిబంధనలు విధించింది.
జిల్లాలో ప్రస్తుత పెన్షన్ల వివరాలు
మొత్తం పెన్షన్లు 1,44,773
వృద్ధులు 33,890
వితంతువులు 35,664
వికలాంగులు 9,822
గీత కార్మికులు 266
ఫైలేరియా బాధితులు 221
డయాలసిస్ బాధితులు 110
ఒంటరి మహిళలు 2,093
బీడీ కార్మికులు 61,933


