కౌన్సిలర్ల ఆరోపణలు అవాస్తవం | - | Sakshi
Sakshi News home page

కౌన్సిలర్ల ఆరోపణలు అవాస్తవం

Aug 30 2026 11:38 PM | Updated on Aug 30 2026 11:38 PM

ఖానాపూర్‌ మున్సిపాలిటీ కార్యాలయంలో శని వారం జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో అధికార కాంగ్రెస్‌ కౌన్సిలర్లు చేసిన వ్యా ఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అంకం మౌనిక పేర్కొన్నారు. సమావేశంలో జరిగిన పరిణామాలపై ఆదివారం కౌన్సి లర్లు, బీజేపీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సర్వసభ్య సమావేశానికి తొలుత వచ్చిన కాంగ్రెస్‌ కౌన్సిలర్లు కమిషనర్‌పై అధికా ర పార్టీ నాయకులతో ఒత్తిడి తెప్పించారని ఆరో పించారు. భయభ్రాంతులకు గురిచేసి ఎజెండా రిజిష్టర్లపై బలవంతంగా సంతకాలు చేయించడంతో సమావేశం వాయిదా పడిందని చెప్పించడం సరికాదని ఆరోపించారు. అనంతరం చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు కార్యాలయానికి చేరుకుని ఎ జెండా రిజిష్టర్‌, కాపీలు తీసుకురావాలని అధికా రులను కోరగా, సమావేశం వాయిదా పడిందని అధికారులు చెప్పారని పేర్కొన్నారు. సమావేశం ప్రారంభం కాకుండానే ఎలా వాయిదా పడుతుందని ప్రశ్నించగా అధికారులు సమాధానం ఇవ్వలేదని తెలిపారు. విధులకు ఆటంకం కలిగిస్తున్నారని అధికారులు ఆరోపించడం సరికాదని పేర్కొన్నారు. అధికారులు సమయపాలన, క్రమశిక్షణ పాటించాలని సూచించినందుకే విషయాన్ని వేరే విధంగా చిత్రీకరించి కమిషనర్‌కు వినతిపత్రం అందించారని మౌనిక పేర్కొన్నా రు. మున్సిపాలిటీ అధికారులు ఇష్టారీతిన వ్యవహరించకుండా ప్రజల కోసం పనిచేయాలని స ర్వసభ్య సమావేశంలో కోరామని, అయితే, దీని పై సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారని తె లిపారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో చైర్‌పర్సన్‌ పదవి దక్కించుకునేందుకు అధికార పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పట్టణాభివృద్ధికి ఆ టంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కౌన్సిల ర్లు గుమ్ముల ఆనంద్‌, బొప్పారపు సత్యవతి, బండిపెల్లి సింధుజ, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement