లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఏ–1, ఎస్‌ఏ–2 పరీక్షల జావాబు పత్రాలను ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో మూల్యాంకనంచేయించాలనే సర్కారు నిర్ణయంపై వ్యతిరేకత వస్తోంది. అయితే, మరింత పారదర్శకత, జవా బుదారీతనం కోసమే ఒక పాఠశాల విద్యార్థులు రాసిన పరీక్షాపత్రాలను ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో వాల్యుయేషన్ చేయించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని పలు ఉపాధ్యాయ సంఘాలు వ్యతి రేకిస్తున్నాయి. కాగా, ఇదివరకు ప్రభుత్వ పాఠశాలల్లో 1–9 తరగతుల విద్యార్థులు రాసిన ఎస్ ఏ–1, ఎస్‌ఏ–2 పరీక్షల జవాబు పత్రాలను ఆ యా పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయులే మూ ల్యాంకనం చేశారు. కొత్త విధానంతో విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయడం కష్టంగా మా రుతుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అయితే, కొంతమంది చేసే తప్పులకు మొత్తం ఉపాధ్యాయ వ్యవస్థను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. లో పాలుంటే అకడమిక్ మానిటరింగ్ పెంచాలని, శాంపిల్ వెరిఫికేషన్ చేయాలని సూచిస్తున్నారు. మోడరేషన్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అవసరమైతే రెండోసారి మూల్యాంకనం చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నా రు. ఎక్స్‌టర్నల్ వాల్యుయేషన్‌ను అమలు చే యడం తమ వృత్తి గౌరవాన్ని దెబ్బతీయడమేన ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయు ల కొరత ఉండటంతో ఇటీవలే సర్దుబాటు చేశారని, ఇప్పుడు ఎక్స్‌టర్నల్ వాల్యుయేషన్ కోసం ఉన్న ఉపాధ్యాయులు వెళ్తే ఆ సమయంలో పాఠశాలలో విద్యార్థులకు ఎవరు పాఠాలు బోధిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయుల పాఠ్యాంశాల బోధనకు కూడా ఆటంకమేర్పడి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని చెబుతున్నారు. విద్యార్థులకు కలిగే బోధన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి. మూల్యాంకనం విషయంలో కొత్తగా తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరుతున్నాయి.
విద్యార్థులకు నష్టమే..
ప్రభుత్వం పునరాలోచించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పరీక్ష పేపర్లు మరో పాఠశాల ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయించాలనే నిర్ణయానికి ముందు విద్యారంగ నిపుణులతో చర్చించాల్సింది. దానిపై శాసీ్త్రయంగా అధ్యయనం చేయాల్సింది. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకుంటే బాగుండు. ఇప్పటికై నా పునరాలోచించాలి.
– అశోక్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి
ప్రభుత్వ ఆదేశాల మేరకే..
ప్రభుత్వ పాఠశాలల్లో 1–9 తరగతుల విద్యార్థుల ఎస్‌ఏ–1, ఎస్‌ఏ–2 పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో చేయించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు, పాఠశాల విద్యాశాఖ సూచనల మేరకు తగిన చర్యలు చేపట్టాలని ఆయా మండలాల విద్యాధికారులకు సూచించాం.
– భోజన్న, జిల్లా విద్యాధికారి


