భైంసారూరల్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సాహిత్యం ద్వారా ఎనలేని సేవలందించిన అ న్నాభావు సాఠే ఆశయాలు అందరికీ స్ఫూర్తిదాయకమని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పేర్కొన్నారు. మండలంలోని సుంక్లి గ్రామంలో ఆదివా రం అన్నాభావు సాఠే విగ్రహాన్ని ఆవిష్కరించి మా ట్లాడారు. సాఠే తన రచనలు, కవితల ద్వారా సమాజంలోని అసమానతలపై పోరాడేందుకు ప్రజల్లో చై తన్యం నింపారని తెలిపారు. అణగారిన వర్గాల హ క్కుల సాధనకు ఆయన కృషి చిరస్మరణీయమని కొ నియాడారు. గ్రామాభివృద్ధికి ఇప్పటికే రూ.80 లక్ష ల వరకు నిధులు కేటాయించామని, అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో బిజ్జూర్ నుంచి పెంచికల్‌పాడ్ మీదుగా సుంక్లి వరకు బీటీ రోడ్డు, వంతెన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, వానల్‌పాడ్ నుంచి వంజర వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయిస్తానని పేర్కొన్నారు. సర్పంచ్ ఆదిరత్న, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


