నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రెండురోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థా యి బాలబాలికల అత్యపత్య–2026 పోటీలు ఆది వారం ముగిశాయి. బాలుర విభాగంలో హైదరాబా ద్ జట్టు విజేతగా నిలవగా, బాలికల విభాగంలో నాగర్‌కర్నూల్ జట్టు కప్పును కై వసం చేసుకుంది. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వన్నెల భూమన్న నేతృత్వంలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని 22 జిల్లాల నుంచి 44 జట్లు పాల్గొన్నా యి. సుమారు 600 మంది క్రీడాకారులు పోటీల్లో త లపడ్డారు. బాలుర విభాగం ఫైనల్‌లో హైదరాబా ద్, రంగారెడ్డి జట్లు తలపడగా హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. బాలికల విభాగంలో నిర్మ ల్, నాగర్‌కర్నూల్ జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగగా నాగర్‌కర్నూల్ జట్టు విజేతగా నిలిచింది. నిర్మల్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు ఎన్‌ఆర్‌ఐ తడక చంద్రశేఖర్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, నాయకులు పోశెట్టి, బ్రహ్మయ్య కప్పులను అందజేశారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పో టీలకు నిర్మల్ వేదిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రా ణించాలని, క్రీడలు ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడతాయని పేర్కొన్నారు. అథ్లెటిక్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవ్, సాఫ్ట్‌బాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు రవీందర్, శ్రీనివాస్, గంగాధర్, సురేశ్, భూమేశ్, కోచ్‌లు సాయిరాజు, ముఖేశ్ తదితరులు పాల్గొన్నారు.


