నిర్మల్‌చైన్‌గేట్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నంగె శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఏ.సతీష్ రెడ్డి, ఎస్.రవి, కార్యదర్శులుగా వొడిసెల కార్తీక్, కుంభారే లక్ష్మణ్, కోశాధికారిగా చౌహాన్ నికేష్, ఈసీ సభ్యుడిగా రమేశ్, సలహాదారులుగా ఎలుకూచి రాజశేఖర్, సాయులును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలు కళాశాలల యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. బకాయిల విడుదల, కళాశాలల స్థిరీకరణ కోసం సంఘం ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలిపారు.


