ఆగిఉన్న లారీని ఢీకొని ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

ఆగిఉన్న లారీని ఢీకొని ఒకరు మృతి

Mar 19 2026 8:46 AM | Updated on Mar 19 2026 8:46 AM

ముధోల్‌: ఆగి ఉన్న లారీని ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై బిట్లా పెర్సిస్‌ తెలిపిన వివరాల మేరకు మండలంలోని విఠోలి గ్రామానికి చెందిన కూరగాయల మారు వ్యాపారి మడకంటి అనిల్‌ (30) బుధవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై భైంసా మార్కెట్‌కు వెళ్తుండగా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement