నిర్మల్ టౌన్: జిల్లా కేంద్రంలో ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గురువారం ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. 19 ఏళ్లుగా జిల్లా కేంద్రంలో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక ఆర్కే కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ కళాకారులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఉగాది పండుగ ప్రాధాన్యత, ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు, గోపూజ యజ్ఞం నిర్వహిస్తామని వివరించారు. అనంతరం ఉగాది ఉత్సవ కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్ కృష్ణంరాజు, డాక్టర్ కత్తి కిరణ్, పొన్నం నారాయణ, పొడెల్లి చిన్నయ్య, గురుమూర్తి, వెన్నెల చిన్నయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.


