న్యూస్‌రీల్
సహజ సాగుకు ప్రభుత్వాల ప్రోత్సాహం జిల్లాలో 1,875 మంది రైతుల ఎంపిక అవగాహన కల్పించి కిట్లు అందిస్తున్న వ్యవసాయాధికారులు
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
నిర్మల్
లక్ష్మణచాంద: ప్రస్తుతం మన తినే ఆహారమే మనకు విషంగా మారుతోంది. సాగులో ఇష్టానుసారంగా వాడుతున్న ఎరువులు, పురుగుమందుల కారణంగా ఉత్పత్తులు విషతుల్యం అవుతున్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా రసాయనాల అవశేషాలు మన శరీరంలోకి వెళ్లి వివిధ వ్యాధులకు కారణం అవుతున్నాయి. మరోవైపు భూసారం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ప్రకృతి వ్యవసాయంవైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించి భూమి సారాన్ని కాపాడేందుకు సహజ సాగును ప్రోత్సహిస్తోంది.
క్లస్టర్లవారీగా రైతుల ఎంపిక..
జిల్లాలో 15 వ్యవసాయ క్లస్టర్లలో ప్రతీ క్లస్టర్‌కు 125 మంది రైతులను వ్యవసాయ అధికారులు ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,875 మందిని ప్రకృతి సేద్యం చేసేలా ప్రోత్సహించేందుకు ఎంపిక చేశారు. వీరికి కిట్లు అందజేశారు.
కిట్లలో ఉపకరణాలు..
కిట్లలో బ్యాగులు, హెడ్ క్యాప్, జీవ ఎరువుల హ్యాండ్‌బుక్ (స్టడీ మెటీరియల్), బాల్ పాయింట్ పెన్, వాల్ క్యాలెండర్, నోట్ ప్యాడ్, ఐడీ కార్డు ఉన్నాయి. ఇవి రైతులకు రోజువారీ పనుల్లో సహాయపడతాయి.
24న హుండీ లెక్కింపు
సారంగపూర్: అడెల్లి దేవాలయం హుండీలను ఈనెల 24న లెక్కించనున్నట్లు ఈవో భూమ య్య తెలిపారు. ఈకార్యక్రమానికి మండలంలో ని ఆయా గ్రామాల సర్పంచులు, ఆయా శాఖల అధికారులు, పాలకవర్గ సభ్యులు, భక్తులు సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు.
అసెంబ్లీలో మాట్లాడుతున్న రామారావుపటేల్
శిక్షణ కార్యక్రమాలు..
ప్రతీ క్లస్టర్‌కు ఇద్దరు మహిళా రైతు మిత్రలు(కృషి సఖులు) ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. వీరు జీవామృతం, ఘన జీవామృతం తయారీ, కషాయాల వాడకం, మిశ్రమ పంటల సాగు నేర్పుతారు. వ్యవసాయ అధికారులు, విద్యాలయాలు, కేవీకే శాస్త్రవేత్తలు కాలానుగుణ అవగాహన కల్పిస్తారు.
భూమికి పునరుజ్జీవం
1,875 మంది రైతులు ఈ ప్రయోగంతో అధిక దిగుబడులు సాధించడంతోపాటు భూసారం పెంపొందిస్తారని అధికారులు అంచనా వేశారు. రసాయనాలు తగ్గడంతో పర్యావరణం, ఆరోగ్యం రక్షణకు దోహదపడుతుందని, పునరుజ్జీవం వస్తుందంటున్నారు. రాబోయే రోజుల్లో మిగతా రైతులంతా సహజ సాగుకు వైపు మళ్లుతారని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.
పీచరలో ప్రకృతి సేద్యంపై ఎంపిక చేసిన రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏఈవో సుశ్మిత


