నిర్మల్‌చైన్‌గేట్: నేటి సమాజంలో మహిళలు అబలలు కాదని, సబలులుగా అన్ని రంగాల్లో ప్రతిభ చా టుతున్నారని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ మహిళా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలి పారు. జిల్లా మహిళలకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యతోనే సాధికారత సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతీ మహిళ తన హక్కులపై అవగాహన కలిగి ఉండాల ని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మహిళలు ఉన్నత స్థానాలు అధిరోహించడం గర్వకారణమని మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళల అభివృద్ధికి పురుషుల సహకా రం అవసరమని, సమాన అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకుసాగాలన్నారు. మహిళలు ఉద్యోగ, కుటుంబ బాధ్యతలతోపాటు తమ వ్యక్తిగత ఆరోగ్యంపైనా దృష్టి సారించాలన్నారు. జిల్లా యంత్రాంగం మహిళా ఉద్యోగుల సంక్షేమానికి ప్రా ధాన్యం ఇస్తుందని తెలిపారు. పనిప్రదేశాల్లో ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల సభ్యులను కలెక్టర్ సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారి వినూత్న, డీఆర్డీవో విజయలక్ష్మి, ఖజానా శాఖ అధికారి సరోజ, ఉపాధి కల్పన అధికారి విజయలక్ష్మి, ఇతర శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.


