జాతీయస్థాయి పోటీలకు తపాలా ఉద్యోగులు | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి పోటీలకు తపాలా ఉద్యోగులు

Mar 19 2026 8:45 AM | Updated on Mar 19 2026 8:45 AM

భైంసా: జాతీయస్థాయి ఖోఖో పోటీలకు తపాలా ఉద్యోగులు డి.నరేశ్‌కుమార్‌, సీహెచ్‌.వినోద్‌కుమార్‌ ఎంపికయ్యారు. ఈనెల 19 నుంచి 22 వరకు మహారాష్ట్రలోని పూణెలో జాతీయస్థాయి పోటీలు జరుగనున్నాయి. ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ ఖోఖో టోర్నమెంట్‌ ఆధ్వర్యంలో తెలంగాణ తరఫున వీరు ఎంపికయ్యారు. ఆర్‌ఎస్‌బీ హైదరాబాద్‌ టీం తరఫున పూణెలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు. డి.నరేశ్‌కుమార్‌ భైంసా మండలం సుంక్లి గ్రామవాసి.

సీహెచ్‌. వినోద్‌కుమార్‌

డి. నరేశ్‌కుమార్‌

ఉత్తమ ఫలితాలు సాధించాలి

నర్సాపూర్‌(జి): పదో తరగతి విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈవో దర్శనం భోజన్న అన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీని బుధవారం సందర్శించారు. కిచెన్‌ రూమ్‌, డైనింగ్‌ హాల్‌, నిత్యావసర సరుకు లు, మధ్యాహ్న భోజనం పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అనంతరం పదో తరగతి విద్యార్థినిలతో మాట్లాడారు. సబ్జెక్టుల్లో సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎస్‌వో వీణ, ఉపాధ్యాయులు ఉన్నారు.

‘పది’ పరీక్షకు ఏడుగురు గైర్హాజరు

నిర్మల్‌ రూరల్‌: జిల్లాలో బుధవారం జరిగిన పదో తరగతి హిందీ పరీక్షకు ఏడుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 9,722 మంది విద్యార్థులకుగాను 9,715 మంది హాజరయ్యారు. డీఈవో భోజన్న సారంగాపూర్‌ ఉన్నత పాఠశాల, బీరవెల్లి ఉన్నత పాఠశాల, దిలావర్‌పూర్‌ ఉన్నత పాఠశాల, నర్సాపూర్‌ ఉన్నత పాఠశాల, కుంటాల ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ నెల 23న ఇంగ్లిష్‌ పరీక్ష జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement