పట్టించుకో ఇక | - | Sakshi
Sakshi News home page

పట్టించుకో ఇక

Feb 20 2026 6:30 AM | Updated on Feb 20 2026 6:30 AM

పట్టి

పట్టించుకో ఇక

నిర్మల్‌ మున్సిపాలిటీలో ఏడాదికిపైగా ప్రత్యేక పాలన పట్టణంలో కరువైన పర్యవేక్షణ సమస్యలతో ప్రజల సతమతం పన్నుల్లో జాప్యం.. పనుల్లో లోపం

పురపాలకా..

జౌళినాల

ద్వారా కురన్నపేట్‌

చెరువులోకి వెళ్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు

నిర్మల్‌: మున్సిపాలిటీల్లో ఏడాదికిపైగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. సంబంధిత అధికారులకు అదనపు బాధ్యత కావడంతో పర్యవేక్షణ అంతంత మాత్రంగానే సాగింది. వార్డుల్లో సైతం పర్యవేక్షణ లోపంతో చిన్నచిన్న పనులు కూడా పూర్తి కాలేదు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు కూడా పన్నుల వసూళ్లల్లో వెనుకబడి ఉన్నాయి. ఈ జాప్యం కూడా పనుల్లో లోపానికి కారణం అవుతోంది. ఎన్నికలు పూర్తి కావడం, వార్డుల్లో కౌన్సిలర్లు, బల్దియాల్లో చైర్మన్లు రావడంతో కనీసం తమ సమస్యలు చెప్పుకోవడానికై నా ఒకరు ఉన్నారన్న భరోసా స్థానికుల్లో వచ్చింది. ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది కేవలం పదవుల కోసం కాదని, పనులు చేయించడానికేనని గుర్తిస్తూ, నూతన పురపాలకులు తమ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది.

నిర్మల్‌ మున్సిపాలిటీలో...

జిల్లా కేంద్రమైనప్పటికీ నిర్మల్‌ మున్సిపాలిటీలో ఇప్పటికీ రోడ్లు డ్రైనేజీలు పారిశుద్ధ్య లోపం, తాగునీటి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. 2016లో జిల్లా ఏర్పడిన తర్వాత నిర్మల్‌ పట్టణం రోజురోజుకు విస్తరిస్తోంది. పెరుగుతున్న పట్టణ జనాభాకు సరిపడా నిధులు, సిబ్బంది కేటాయింపు లేకపోవడం ఇబ్బందిగా మారింది. మొత్తం 42 వార్డుల్లో మురికివాడలే అధికంగా ఉన్నాయి. పాతబస్తీలో జౌళినాళాకు శాశ్వత పరిష్కారం కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రతీ ఏడాది దీని కోసమే రూ.లక్షలు కేటాయించాల్సి వస్తోంది. శివారు కాలనీల్లో మరీ దారుణం. కొన్ని కాలనీల్లో ఇప్పటికీ కనీసం మట్టి రోడ్లు కూడా లేవు. వర్షాకాలం బురదలో నడవడం కూడా కష్టంగా మారుతోంది. ఏటా వర్షాకాలంలో జీఎన్‌ఆర్‌ కాలనీ, ఇంద్రానగర్‌, శాస్త్రి నగర్‌, ప్రియదర్శిని నగర్‌ తదితర కాలనీలతోపాటు శివాజీ చౌక్‌, మంచిర్యాల రోడ్డు, డాక్టర్స్‌ లైన్‌ ప్రధాన రహదారులు కూడా ముంపునకు గురవుతున్నాయి. చాలావరకు చెరువులు, కందకాలను, నాళాలను కబ్జాలు చేయడమే ముంపునకు దారితీస్తున్నాయి.

ట్రాఫిక్‌ అతిపెద్ద సమస్య..

జిల్లాకేంద్రంలో ట్రాఫిక్‌ అతిపెద్ద సమస్యగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్యతోపాటు ప్రధాన రహదారులపై ఇష్టారాజ్యంగా తోపుడుబండ్లను, దుకాణాలను ఏర్పాటు చేయడం ట్రాఫిక్‌ సమస్యను పెంచుతున్నాయి. బస్టాండ్‌, వివేకానంద చౌక్‌, ఎన్టీఆర్‌ మినీ స్టేడియం తదితర ప్రాంతాల్లో మూల మలుపుల వద్ద కనీసం కారు కూడా యూటర్న్‌ తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. రహదారులపై అడ్డంకులు లేకుండా చూడటంతోపాటు, వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం కల్పించడం, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ కూడా మెయింటేన్‌ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీదే. గాంధీ కూరగాయల మార్కెట్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉంది. జిల్లా కేంద్ర ప్రజలు ఆహ్లాదంగా గడపడానికి ఒక పార్కు కూడా లేదు. అలాగే కనీసం వాకింగ్‌ చేయడానికి ట్రాక్‌, ఓపెన్‌ జిమ్‌లు లేవు. జిల్లాలో కోతులు కూడా ప్రధాన సమస్యగా మారాయి. పలు కాలనీలలో పందులు, కుక్కలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. కాలనీలలో ఇంటింటి చెత్త సేకరణ చాలా వరకు నిలిచిపోవడంతో మళ్లీ వీధుల్లో చెత్త వేస్తున్నారు. దీంతో పట్టణంలో స్వచ్ఛత లోపిస్తోంది. నిర్మల్‌లో ఇప్పటికీ నీటి కష్టం లేకుండా ఉందంటే కేవలం గొలుసు కట్టు చెరువులే కారణం. అలాంటి చెరువులలోకి నిర్మల్‌ డ్రైనేజీలన్నీ వదులుతుండటం దారుణం. ఈ సమస్యకు సివరేజీ ట్రీట్మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటుతోపాటు నిర్మల్‌లో ఇప్పటికై నా ఓ డ్రైనేజీ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉంది.

ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల మధ్యలో పారుతున్న మురుగునీరు

సోఫీ నగర్‌లో రోడ్డుపై మురుగు నీరు, గుంతలు

పట్టించుకో ఇక1
1/2

పట్టించుకో ఇక

పట్టించుకో ఇక2
2/2

పట్టించుకో ఇక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement