ఉత్తమ ప్రదర్శనకు ప్రశంస
సారంగపూర్: మండలంలోని చించోలి(బి) ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మునీందర్ రాజు కు ఎస్‌సీఈఆర్టీ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబా ద్‌లో నిర్వహించిన సెమినార్‌లో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ చేసినందుకు గాను ప్రశంసాపత్రంతో గౌరవించారు. విద్యార్థులకు జనరేటివ్ ఏఐ ద్వారా అభ్యాస వేదిక అనే వెబ్‌సైట్ రూపొందించి హైదరాబాద్‌లో జరిగే సెమినార్‌కు మునీందర్‌రాజు ఎంపికయ్యారు. విద్యార్థుల కోసం రూపొందించిన అభ్యసవేదికపై గురువారం నిర్వహించిన సెమినార్‌లో ప్రదర్శన ఇచ్చారు. ఈవెబ్‌సైట్ విద్యార్థులకు ఏవిధంగా ఉపయోగపడుతుందో వివరించారు. రాష్ట్ర విద్యాపరిశోధనా సంస్థ డైరెక్టర్ గాజర్ల రమేశ్ మనీందర్‌రాజుకు ప్రశంసాపత్రం అందజేశారు.


