ఛత్రపతి చరిత్రను ఊరూరా తెలియజేయాలి
ఖానాపూర్: పోరాట వీరుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని, యువత జీవితంలో ఎదగాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మండలంలోని దిలావర్‌పూర్ గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. శివాజి చరిత్ర ఊరూరా తెలిసేలా యువత కృషిచేయాలన్నారు. సంస్కృతి, సంప్రదాయాలతోపాటు ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని ప్రతీ ఒక్కరు ఐఏఎస్‌లుగా, ఎమ్మెల్యేలు, డాక్టర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యేను యూత్ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ చింతల మల్లేశ్, ఉపసర్పంచ్ ఓరగంటి రాజేశ్వర్, ఆర్‌ఎస్‌ఎస్ వక్త ఉల్లెంగుల ముత్యం, కామాజి హరిచరణ్, గుగ్గిల్ల శివకుమార్‌గౌడ్, సిద్ధం రమేశ్‌గౌడ్, కడారి రాజు, ఎనుగు నర్సారెడ్డి, భూమన్నగౌడ్, కామాజి కిషన్, గుగ్గిల్ల సంతోష్‌గౌడ్, నబీఖాన్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో రమాకాంత్, ఎంపీవో రత్నాకర్‌రావు, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు.


