శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలి
నిర్మల్‌చైన్‌గేట్/లక్ష్మణచాంద/సారంగపూర్: యువత ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను స్ఫూర్తిగా తీసుకుని హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. సారంగాపూర్ మండలం మలక్‌చించోలి, బీరవెల్లి గ్రామాల్లో, లక్ష్మణచాంద మండలం మునిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన శివాజీ మహరాజ్ విగ్రహాలను గురువారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన హిందూధర్మ పరిరక్షణకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి హిందూధర్మ పరిరక్షణకు ఆయన పాటుపడిన విధానాలను స్ఫూర్తిగా తీసుకుని యువకులు ముందుకు సాగాలని సూచించారు. అనంతరం మండలంలోని బీరవెల్లి, గోపాల్‌పేట్, ఆలూరు గ్రామాల్లో ఒక్కోటి రూ.10 లక్షల వ్యయంతో నిర్మించే ఎస్‌హెచ్‌జీ భవనాలకు భూమిపూజ చేశారు. మునిపల్లి గ్రామంలో రూ.12 లక్షలతో నిర్మించే అంగన్‌వాడీ భవనానికి శంకుస్థాపన చేశారు. మల్లాపూర్ గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించే వీవో భవనానికి, రూ.10 లక్షలతో చేపట్టే ఎస్‌హెచ్‌జీ వర్క్ షెడ్ పనులకు శంకుస్థాపన చేశారు. తిర్పెల్లి గ్రామంలో రూ.20 లక్షలతోనిర్మించే పంచాయతీ భవనానికి, రూ.10 లక్షలతో నిర్మించే వీవో భవనానికి, రూ.7.50 లక్షలతో పాఠశాలలో నిర్మించే రెండు అదనపు గదులకు భూమిపూజ చేశారు. వేర్వేరు కార్యక్రమాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు రావుల రాంనాథ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, ఆయా గ్రామాల సర్పంచులు బ్యాగరి గంగవ్వ, మంతెన గంగారెడ్డి, సాహెబ్‌రావు, లక్ష్మణచాంద తహసీల్దార్ సరిత, ఎంపీడీవో రాధ, సర్పంచులు మేడిపెల్లి సునీత, ఉడుత స్వప్న, బొమ్మెన గిరిజ, బీజేపీ మండల అధ్యక్షుడు చిన్నయ్య, నాయకులు అడ్వాల రమేశ్, అయిండ్ల భూపాల్‌రెడ్డి, రవి, బీమేష్, గంగాధర్,రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.


