భైంసా బల్దియా పోలింగ్ కేంద్రాలివే..
భైంసాటౌన్: మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు చర్యలు వేగవంతమయ్యాయి. ఎన్నికల కమిషన్ షెడ్యూ ల్ ప్రకారం ఓటరు ముసాయిదా జాబితా, తుదిజా బితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. వార్డులవారీగా పోలింగ్ కేంద్రాలు గుర్తించిన అధికారులు ముసాయిదా జాబితా కూడా విడుదల చేశారు. అభ్యంతరాలుంటే గురువారం సా యంత్రం వరకు మున్సిపల్ కార్యాలయంలోని ఎ న్నికల విభాగంలో దరఖాస్తు చేసుకోవాలని సూ చించారు. 16న తుది జాబాతా విడుదల చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలో 51,118 మంది ఓటర్లుండగా, 74 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ప్రతీ వార్డుకు కి.మీ పరిధిలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఒక్కో కేంద్రంలో సరాసరి 690 ఓటర్లను సర్దుబాటు చేశారు. 1, 6, 19 వార్డుల్లో గరిష్టంగా నాలుగు చొప్పున పోలింగ్ కేంద్రాలు ఉండగా, మిగతా వార్డుల్లో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా రెండు నుంచి మూడు కేంద్రాలను గుర్తించారు.


