సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16న నిర్వహించనున్న సీ ఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభకు పకడ్బందీ ఏ ర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కష్ణారావు అధికారులను ఆదేశించారు. సీఎం జి ల్లా పర్యటన నేపథ్యంలో బుధవారం ఎన్టీఆర్ మి నీ స్టేడియంలో చేపట్టిన ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి పరిశీలించారు. ముందుగా మంత్రి, ప్ర భుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డికి కలెక్టర్ అటవీశాఖ అతిథి గృహంలో పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మంత్రి, ప్రభుత్వ సలహాదారుకు గౌ రవ వందనం చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎస్పీ జానకీ షర్మిల, అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.


