మంత్రిని కలిసిన సదర్మాట్ రైతాంగం
కడెం: సదర్మాట్ ప్రత్యేక కాలువ సాధన సమితి అధ్యక్షుడు హపవత్ రాజేందర్ ఆధ్వర్యంలో సదర్మాట్ ఆయకట్టు రైతులు బుధవారం మామడ మండలంలోని పొన్కల్ సదర్మాట్ బ్యారేజీ వద్ద ఉమ్మడిజిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్, డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్‌ను కలిశారు. సదర్మాట్ ప్రత్యేక కాలువ ఏర్పాటు గురించి విన్నవించి సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సదర్మాట్ ఆయకట్టుకు యాసంగికి సాగునీటిని వారబందీ పద్ధతిన కాకుండా నిరంతరాయంగా విడుదల చేయాలని వేడుకున్నారు. రైతులు ముక్కెర శ్రీనివాస్, సత్తెన్న, సదానందం, సతీశ్, శంకర్, దేవన్న తదితరులున్నారు.


