ప్రత్యేక కాలువతో ఆయకట్టుకు జీవం
కడెం: మామడ మండలం పొన్కల్ వద్ద నిర్మించిన సదర్మాట్ బ్యారేజీ నుంచి ఖానాపూర్ మండలం మేడంపల్లి పాత సదర్మాట్ వరకు ప్రత్యేక కాలువ నిర్మించి సాగునీరు అందిస్తే ఆయకుట్టకు జీవం వస్తుదని చివరి వరకు సాగునీరు అందుతుందని ప్రత్యేక కాలువ సాధన కమిటీ అధ్యక్షుడు హపావత్ రాజేందర్ అన్నారు. ఆయకట్టు రైతులతో కలిసి మండల కేంద్రంలో శనివారం దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మండలంలోని కొత్త మద్దిపడగ, పాత మద్దిపడగ, పెద్దూర్, తండా, బదిల్దార్‌నగర్, ఎలగడప, లింగాపూర్, లక్ష్మిసాగర్, నచ్చన్‌ఎల్లాపూర్ తదితర గ్రామాల నుంచి రైతులు తరలివచ్చారు. ఖానాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్, న్యాయవాదులు, ఉద్యమకారులు, పలు గ్రామాలకు చెందిన రైతులు దీక్షకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం స్పందించి కాలువ నిర్మాణానికి అనుమతి ఇచ్చి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులు పట్టించుకోకపోవడం లేదని తెలంగాణ తల్లి విగ్రహాకి రైతులు వినతిపత్రం అందజేశారు.


