రోడ్డు భద్రత అందరి బాధ్యత
సారంగపూర్/నిర్మల్‌టౌన్: రోడ్డు భద్రతను అందరూ బాధ్యతగా భావించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని జిల్లా సీనియర్ జడ్జి రాధిక అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా సారంగాపూర్ మండలం చించోలిబి క్రాస్‌రోడ్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర డిగ్రీ కళాశాల విద్యార్థులకు రోడ్డు భద్రతపై శుక్రవారం అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలు అనుసరిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అందరూ ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవడంతోపాటు వాటిని పాటించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, ఏఎంవీఐలు రజినీకాంత్, అక్షయ్, రనాశ్రీ, అధ్యాపకులు పాల్గొన్నారు.


