అల్పాహారంలో కోత
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ఉత్తమ ఫలితాల కోసం గత అక్టోబర్ నుంచి సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. అయితే అల్పాహారం లేకపోవటంపై ఫిర్యాదులు వచ్చాక ప్రభుత్వం స్పందించింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు 19 రోజులు అందించేలా ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఒక్కో విద్యార్థికి రూ.15
ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 కేటాయించారు. ఈ మొత్తంతో సాయంత్రం అల్పాహారం అందించాలి. ఈ చర్య విద్యార్థుల ఇబ్బందులను తగ్గించి చదువుకు దృష్టి పెడతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే 19 రోజుల మాత్రమే అల్పాహారం అందించడానికి పోషకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 38 రోజులు అందించిన ప్రభుత్వం ఇప్పుడు 19 రోజులకు కుదించడం సరికాదంటున్నారు. మరిన్ని రోజులు అల్పాహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ముందుగా ప్రారంభించాలి
ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు కేవలం 19 రోజులకు మాత్రమే అల్పాహారం అందించాలని నిర్ణయించడం సరికాదు. దీంతో తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. ఫిబ్రవరి మొదటి వారం నుండే అల్పాహారం అందిస్తే మాకు మరింత మేలు జరుగుతుంది.
– శ్రేష్ట పది విద్యార్థి, బాబాపూర్ పాఠశాల
రుచికరమైన అల్పాహారం..
రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోల ఆదేశాల మేరకు ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అందిస్తాం. రుచికరంగా, నాణ్యమైనదిగా అందేలా చూస్తాం. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలాగా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలి.
– భోజన్న, డీఈవో, నిర్మల్
ఉమ్మడి జిల్లాల్లో విద్యార్థుల సంఖ్య
జిల్లా పాఠశాలల విద్యార్థులు సంఖ్య సంఖ్య
నిర్మల్ 108 3,580
ఆదిలాబాద్ 100 3,324
కుమురం భీం 51 2,225
మంచిర్యాల 97 2,885
అల్పాహారంలో కోత


