ఇంటర్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
నిర్మల్‌చైన్‌గేట్: ఇంటర్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాటు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో కలుపుకుని 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో 6,652 మంది ప్రథమ సంవత్సర, 6,473 మంది ద్వితీయ సంవత్సర పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష, జవాబు పత్రాల తరలింపు సమయంలో తగిన భద్రతను ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహించాలన్నారు. పరీక్ష టైంలో పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడపాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో భా గస్వామ్యం అయ్యే అధికారులందరికీ శిక్షణను ఇ వ్వాలని తెలిపారు. మాస్ కాపీయింగ్‌కు తావు లే కుండా పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలన్నా రు. సమావేశంలో డీఐఈవో పరశురాం, డీఈవో భోజన్న, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


