గోదావరి పుష్కరాలకు విస్తృతంగా ఏర్పాట్లు
బాసర: బాసరలో గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తామని భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్‌కుమార్ అన్నారు. పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కేంద్రం బృందం గురువారం బాసరకు వచ్చింది. సబ్ కలెక్టర్‌తో కలిసి గోదావరి నది మొద టి, రెండో ఘాట్‌లను పరిశీలించింది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సబ్ కలెక్టర్ కేంద్ర బృందానికి తెలిపారు. పంచాయతీరాజ్, ఇంజి నీరింగ్, ఆర్‌అండ్‌బీ అధికారులు సమన్వయం చేసుకుంటూ పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. భక్తుల రద్దీని అంచనా వేసుకుని సదుపాయాలు కల్పించేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు ఆర్కిటిక్ జ్యోత్స్న, కుషాల్ గో యల్, బాసర ఆలయ ఈవో అంజనాదేవి, ఏఈ శ్యాంసుందర్, తహసీల్దార్ పవన్‌చంద్ర, ఆర్‌ఐ అభిమన్యు, ఆలయ సూపరింటెండెంట్ శివరాజ్, పీఆ ర్వో నారాయణ పటేల్, ఎస్సై నవనీత్‌రెడ్డి పాల్గొన్నారు.


