గడువులోపు ఫిర్యాదులు పరిష్కరించాలి
నిర్మల్‌చైన్‌గేట్: మున్సిపాలిటీ ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించా రు. జిల్లాలవారీగా ఓటరు జాబితాలపై వచ్చిన అ భ్యంతరాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ.. ఈనెల 12న వార్డులవారీగా ఫొ టో ఎలక్టోరల్ జాబితా, 13న డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాలను ప్రచురిస్తామని చెప్పారు. 16న తుది పోలింగ్ కేంద్రాల వివరాలు ప్రచురించి, పోలింగ్ కేంద్రాలవారీగా ఫొటో ఎలక్టోరల్ జాబితా ప్రచురిస్తామని తెలిపారు. అభ్యంతరాల ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. 2025కు సంబంధించి 3వ సప్లిమెంటరీ ఓటరు జాబితా నవంబర్ 15న విడుదలైందని తెలిపారు. దీని ప్రకారం పట్టణాల్లో వార్డులవారీగా డ్రాఫ్ట్ ఓటరు జాబితా జనవరి 1న విడుదల చేశామని పేర్కొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మా ట్లాడుతూ.. ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరా ల ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని తెలిపారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్‌గౌడ్, సుందర్‌సింగ్ ఉన్నారు.
జిల్లాస్థాయి అటవీ కమిటీ సమావేశం
కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అట వీ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లాలోని అటవీ, గిరిజన ప్రాంత ప్ర జలకు మెరుగైన రవాణా, విద్యుత్, తదితర మౌలిక సదుపాయాల కల్పన దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, డీఎఫ్‌వో సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డీవో రత్నకళ్యాణి, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్ సుదర్శన్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, రెవెన్యూ, ఇంజినీరింగ్, విద్యుత్‌శాఖల అధికారులు, తహసీల్లార్లు ఉన్నారు.


