అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ
నిర్మల్‌చైన్‌గేట్: అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ అని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పే ర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ సంఘ భవనలో లూయిస్ బ్రెయిలీ 217వ జయంతిని మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అ నంతరం జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. లూయిస్ బ్రెయిలీ భవిష్యత్ తరాల గురించి ఆలోచించి అంధ సమాజానికి సేవలందించాలని ఆలోచించారని కొనియాడారు. ఇది ఆయన నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సివిల్ జడ్జి రాధిక, నిర్మల్ మార్కె ట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి, రిటైర్డ్ పెన్షనర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు లింగన్న పాల్గొన్నారు.


