
సింగరేణి బకాయిలు చెల్లించాలి
శ్రీరాంపూర్: సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ డబ్బులను వెంటనే చెల్లించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామ య్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన శ్రీ రాంపూర్‌లోని ఎస్‌ఆర్పీ–3 గనిలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో రూ.27వేల కోట్ల బకాయిలుంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.42 వే ల కోట్లకు పెరిగిందని తెలిపారు. సమయానికి బకా యిలు చెల్లించకపోవడంతో సంస్థ ఆర్థిక ఇబ్బందులు పడుతోందని పేర్కొన్నారు. సింగరేణిలో రాజకీ య జోక్యంతో సంస్థ పాలన గాడి తప్పుతోందని తె లిపారు. గుర్తింపు సంఘంగా తాము గెలిచిన తర్వా త కార్మికుల ప్రధాన డిమాండ్లను ఒక్కొక్కటిగా పరి ష్కరిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. గతంలో జరగని స్ట్రక్చరల్ సమావేశాలు నిర్వహించి కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తున్నామని తెలిపారు. కార్మి కుల ప్రధాన డిమాండ్ల సాధనకు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తూ సాధనకు కృషి చేస్తున్నామని చెప్పారు. కంపెనీ వార్షిక లాభాలను ప్రకటించి అందులో నుంచి 35శాతం వాటా కార్మికులకు చెల్లించాలని డి మాండ్ చేశారు. యూనియన్ డిప్యూటీ ప్రధాన కా ర్యదర్శి ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, జీఎం చర్చల కమిటీ ప్రతినిధులు ప్రసాద్‌రెడ్డి, సంపత్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజి యన్ కార్యదర్శి అఫ్రోజ్‌ఖాన్, పిట్ సెక్రటరీ మురళీచౌదరి, ఆకుల లచ్చన్న, జాడి రాజకుమార్, కారుకూరి నగేశ్ తదితరులు పాల్గొన్నారు.