
ఆర్జీయూకేటీలో ముగిసిన స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రాం
బాసర: బాసరలోని ఆర్జీయూకేటీలో ఇంజినీరింగ్‌లో అడుగుపెడుతున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రాం మంగళవారం ముగిసింది. వారం రోజులుగా కొనసాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు విద్య, వ్యక్తిత్వ వికాసం, మానవ విలువలు, నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిగత అభివృద్ధి వంటి విభిన్న అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీదర్శన్, స్టూడెంట్ కోఆర్డినేటర్ మహబూబ్, అసోసియేట్ డీన్‌లు చంద్రశేఖర్, మహేశ్, విఠల్, ఇంజినీరింగ్ విభాగాధిపతులు ఉపేందర్, భావ్‌సింగ్ వినయ్, కోఆర్డినేటర్ తేజస్వి, సైదులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సొసైటీ సీఈవోల బదిలీ
కైలాస్‌నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈవోలకు స్థానచలనం కలిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 66మంది సీఈవోలు ఉండగా, 49 మందిని వివిధ మండలాలకు బదిలీ చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరో 17 సొసైటీల్లో రెగ్యులర్ సీఈవో లేకపోవడంతో వారికి ఎలాంటి బదిలీ జరగలేదు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీ చేసినట్లు జిల్లా సహకారశాఖ అధికారి మోహన్ తెలిపారు.