సెలవుల్లోనూ విధులు
కడెం: సెలవులు వచ్చాయంటే ఎటు వెళ్దాం.. ఎన్నిరోజులు టూర్ వేద్దాం అని ప్రభుత్వ ఉద్యోగులు ప్లాన్ చేస్తుంటారు. వేసవి సెలవులు ప్రారంభం కావడంలో ఇప్పటికే చాలా మంది టూర్లకు వెళ్లారు. కడెం మండలం ఎలగడప ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం కుచనపెల్లి శ్రీని వాస్ మాత్రం సెలవుల్లోనూ విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణ లేకున్నా వృత్తిపై ఉన్న మమకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. శనివారం గ్రామంలో ఉపాధి పనులు పూర్తయిన తర్వాత కూలీలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉచితవిద్య, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వివరించారు. ప్రభుత్వ పాఠశాలకే పిల్లలను పంపించాలని కోరారు.


