వీరులకు.. గుర్తింపునివాళి | - | Sakshi
Sakshi News home page

వీరులకు.. గుర్తింపునివాళి

Apr 10 2025 12:09 AM | Updated on Apr 10 2025 12:09 AM

వీరుల

వీరులకు.. గుర్తింపునివాళి

నిర్మల్‌
వనమహోత్సవంపై దృష్టి
వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నా టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రతీ గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలు పెంచుతోంది.

గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

9లోu

చరిత్రకెక్కని చరితార్థులు

స్వాతంత్య్రం కోసం నిర్మల్‌ గడ్డపై ఆంగ్లేయులు, నైజాంసేనలతో పోరాడి తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన రాంజీగోండు సహా వెయ్యిమంది వీరులు చిరస్మరణీయులను డాక్టర్‌ కృష్ణంరాజు కొనియాడారు. స్వాతంత్య్ర పోరాటంలో జలియన్‌వాలాబాగ్‌ కంటే ముందే జరిగిన అత్యంత ఘోరమైన వెయ్యిఉరులమర్రి ఘటనపై చరిత్రలో పెద్దగా ప్రస్తావన లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. రాంజీసహా వెయ్యిమంది వీరులు చరిత్రకెక్కని చరితార్థులని కొనియాడారు. పాలకులు, అధికారులు ఇప్పటికై నా నిర్మల్‌ చరిత్రకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ట్యాంక్‌బండ్‌పై రాంజీ గోండు విగ్రహం పెట్టడమే కాకుండా, పాఠ్యాంశంలో చేర్చి ముందుతరాలకు అందించాలని కోరారు. నేటి యు వత రాంజీ పోరాటస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవా లని సూచించారు. చరిత్ర పరిరక్షణతో పాటు భావి తరాలకు అందించాలన్న లక్ష్యంతో ‘సాక్షి మీడియా’ చేస్తున్న అక్షరకృషి అభినందనీయమని పేర్కొన్నా రు. ఈ సందర్భంగా యువకవి ఆయిటి సాహితీ ‘అడవి బిడ్డలను ఆయుధాలుగా మలచి..’ అంటూ అప్పటికప్పుడు కవిత వినిపించి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో రాంజీగోండు స్మారక సమితి కన్వీనర్‌ పోలీస్‌ భీమేశ్‌, లైబ్రేరియన్‌ దీపక్‌, రాజమణి, సంకల్ప్‌ సొసైటీ కన్వీనర్‌ కిశోర్‌, సాక్షి జిల్లా ఇన్‌చార్జి రాసం శ్రీధర్‌, స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ కై లాశ్‌, యువతీయువకులు పాల్గొన్నారు.

అమరుల స్ఫూర్తిని నింపేలా..

‘వెయ్యిఉరులమర్రి’ పాఠ్యాంశమవ్వాలి

నిర్మల్‌లో స్మారక కేంద్రం నిర్మించాలి

రాంజీగోండు కాంస్యవిగ్రహం పెట్టాలి

‘సాక్షి’ ఆధ్వర్యంలో త్యాగాలదినం

రాంజీ సహా వెయ్యిమంది అమరవీరులకు అధికారికంగా గుర్తింపునివ్వాలని యువత డిమాండ్‌ చేసింది. వెయ్యిఉరులమర్రి చరిత్రను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు స్థానికంగా భారీ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. జిల్లా కేంద్రంలోని డాక్టర్స్‌లైన్‌లో గల డాక్టర్‌ కావేరీ లైబ్రరీలో రాంజీగోండు స్మారక సమితి సహకారంతో బుధవారం ‘సాక్షి మీడియా’ ఆధ్వర్యంలో రాంజీగోండు సహా వెయ్యిమంది అమరవీరుల త్యాగాలదినం నిర్వహించారు. ముందుగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సామాజికవేత్త, డాక్టర్‌ కృష్ణంరాజు, యువతీయువకులు రాంజీగోండు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెయ్యిమంది అమరుల ఆత్మలకు శాంతి చేకూరాలంటూ రెండునిమిషాలు మౌనం పాటించారు.

–నిర్మల్‌

పూర్తిపాఠంగా పెట్టాలి

దేశచరిత్రలోనే అరుదైన వెయ్యిఉరులమర్రి ఘటనను ఇప్పటికై నా పూర్తిపాఠంగా విద్యార్థులకు అందించాలి. రాంజీగోండు సహా వెయ్యిమంది చేసిన పోరాటాన్ని, త్యాగాన్ని వివరించాలి. – అరుణ్‌, నిర్మల్‌

నిర్మల్‌ చరిత్రను గుర్తించాలి

వందలఏళ్ల చరిత్ర ఉన్న నిర్మల్‌ ప్రాంతాన్ని పాలకులు ముందునుంచీ చిన్నచూపు చూస్తున్నారు. ఇప్పటికై నా ఇక్కడి చరిత్ర, చారిత్రక కట్టడాలను ప్రభుత్వాలు వెలుగులోకి తీసుకురావాలి. – విశాల్‌, నిర్మల్‌

చాలామందికి తెలియదు

నిర్మల్‌ గడ్డపైనే రాంజీగోండు సహా వెయ్యిమంది వీరులు చేసిన పోరాటం, వారి ప్రాణత్యాగాల గురించి ఇప్పటికీ చాలామంది తెలియదు. మన చరిత్రను విస్తృతంగా తెలియజెప్పాలి. – నిఖిత, నిర్మల్‌

వీరులకు.. గుర్తింపునివాళి 1
1/3

వీరులకు.. గుర్తింపునివాళి

వీరులకు.. గుర్తింపునివాళి 2
2/3

వీరులకు.. గుర్తింపునివాళి

వీరులకు.. గుర్తింపునివాళి 3
3/3

వీరులకు.. గుర్తింపునివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement