‘బీజేపీతోనే అభివృద్ధి’
సారంగపూర్: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఆలూరు గ్రామంలో నిర్మించిన పీఏసీఎస్ భవనం, 500 మెట్రిక్‌టన్నుల సామర్థ్యం గల గోదాంను శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాయని దుయ్యబట్టారు. కేంద్రంలో అధి కారంలో ఉన్న బీజేపీ సుస్థిర పాలన, సమగ్ర అభివృద్ధిని సాధిస్తోందని తెలిపారు. రైతులు పండించిన పంటలు నిల్వ చేసుకునేందుకు గోదాం ఉపయోగపడుతుందన్నారు. అనంతరం గ్రామానికి చెందిన చింతకుంట ముత్తన్నకు సీఎంఆర్‌ఎఫ్ నుంచి మంజూరైన రూ.2 లక్షల చెక్కును అందించారు. పీఏసీఎస్ చైర్మన్ మాణిక్‌రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు నరేశ్, నాయకులు సాహెబ్‌రావు, గంగారెడ్డి, రాజేందర్‌రెడ్డి, మధు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.


