మంత్రి అజారుద్దీన్‌ను కలిసిన మైనార్టీ నాయకులు
న్యూస్‌రీల్
బాసర: రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌ను బాసర గ్రామానికి చెందిన మైనారిటీ నాయకులు ఎండీ.మొయినుద్దీ న్‌ఖాజీ ఆధ్వర్యంలో శనివారం కలిశారు. శుభాకంక్షలు తెలిపారు. మైనార్టీల అభివృద్ధికి సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మైనార్టీలు విద్యలో ముందుండాలని సూచించారు. సమస్యలపై అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. మంత్రిని కలిసినవారిలో అజ్గర్, లాల్ మియ్యా, ఖలీల్ తదితరులు ఉన్నారు.


