నానమ్మ నేర్పింది..
నేను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాను. సంక్రాంతికి సొంతూరికి వచ్చాను. ఇంటికి రావడంలో ఉన్న ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఈసారి మా నాన్నమ్మ ప్రత్యేకంగా సకినాలు ఎలా చేయాలో దగ్గరుండి నేర్పింది.. సంప్రదాయ పిండి వంటల్లోని రుచులకు మరేది సాటిరాదు.
– బీఎస్.ప్రసన్న, ఎంబీబీఎస్, థర్డ్ ఇయర్, చించోలి(బి), సారంగాపూర్
మా శ్రీవారికి ప్రత్యేకంగా..
వృత్తిరీత్యా మావారు కువైట్ దేశంలో ఉంటున్నారు. ఏటా పండగకు ఇండియాకు వచ్చేవారు. ఈసారి కుదరకపోవడంతో ఇక్కడి పిండి వంటల్ని తనకోసం పంపిస్తున్నాను. తెలుగు వారికి సంక్రాంతి పండగ ప్రత్యేకం. ఇంటిల్లిపాది కలిసి పిండి వంటలు చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది.
– గోనె శిరీష, గృహిణి, నిర్మల్
నానమ్మ నేర్పింది..


