సకినాలు కరకర..
నోరూరిస్తున్న సంక్రాంతి వంటకాలు పండుగ సమీపిస్తుండడంతో తయారీలో మహిళల బిజీ పల్లెల్లో వెల్లివిరుస్తున్న కుంటుంబ ఐక్యత సంప్రదాయ వంటకాలతో ఆరోగ్యం అంటున్న అతివలు
అరిసెలు ఘుమఘుమ
నిర్మల్‌ఖిల్లా: సంక్రాంతి అంటేనే పల్లె పండుగ. ఇంటింటా పిండివంటలు ఘుమఘుమలు.. భోగి మంటల ఉల్లాసం.. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి వంటలకే పరిమితం కాకుండా, ఉమ్మడి కుటుంబ సంస్కతి, ఇరుగుపొరుగు ఐక్యత, మహిళల శ్రమకు అద్దం పడుతున్నాయి. జిల్లాలోని ఉమ్మడి కుటుంబాల్లో సంక్రాంతి పండుగ ప్రత్యేకంగా కనిపిస్తోంది. అత్తమ్మలు, కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లతో ఇళ్లలో పండుగ సందడి మొదలైంది. బంధువలంతా రావడంతో చాలా మంది పిండి వంటకాల తయారీ మొదలు పెట్టారు. కరకరలాడే సకినాలు, గారెలు.. రోరూరించే అరిసెలు, మురుకులు, తీపి వంటకాలతో గడప డగప ఘుమఘుమలాడుతోంది. ఒక రోజు ఒక ఇంట్లో, మరో రోజు పొరుగు ఇంట్లో అందరూ కలిసి పిండివంటలు తయారు చేస్తూ పల్లెల్లో కుంటుంబ ఐక్యత వెల్లివిరుస్తోంది.
సంప్రదాయ వంటలు, కొత్త ప్రయోగాలు
చక్కర్లు, బెల్లం పొంగల్, సున్నుండలు, బూరెలు, జంతికలు, మురుకులు వంటి వంటకాల సిద్ధమవుతున్నాయి. కొందరు తాతమ్మల కాలం రుచులను పునరుద్ధరిస్తుంటే, మరికొందరు కొత్త రుచులతో ప్రయోగిస్తున్నారు. బొబ్బట్లు, మురుకులు వంటివి ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న ఉంటున్న జిల్లాకు చెందిన పలువురికి వారి కుటుంబ సభ్యులు పిండివంటలు పంపుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా ఉంటున్నవారికి ప్రత్యేక ప్యాకింగ్‌తో పంపుతున్నారు. దూరంగా ఉన్నా మా చేతి రుచి తినాలన్నదే వారి తపన.
స్వగ్రామాల్లో సాఫ్ట్‌వేర్ నిపుణులు..
ఇక సంక్రాంతి పండుగకు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు స్వస్థలాలకు వస్తున్నారు. ఐటీ కంపెనీల ఒత్తిడి నుంచి విరామం పొంది అమ్మానాన్నలతో ఆనందంగా గడుపుతామంటున్నారు. అమ్మమ్మల అనుభవాలు, యువత ఉత్సాహం, పిల్లల కేరింతలు కలిసి ఆనంద వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ‘అమ్మ చేతి రుచి అసలైన సంక్రాంతి‘ అంటూ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
సకినాలు కరకర..


