పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల కార్యవర్గం
నిర్మల్ రూరల్: పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నరసింహస్వామి, జనరల్ సెక్రెటరీగా సురేష్ చందర్‌గౌడ్, సహాధ్యక్షుడిగా కొక్కుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు–1 అన్నపూర్ణ, ఉపాధ్యక్షులు–2 మహ్మద్ షాహిద్ అహ్మద్, ఉపాధ్యక్షులు–3 పుప్పాల కృష్ణకుమార్, ఉపాధ్యక్షులు–4 ఠాకూర్ నారాయణసింగ్, సంయుక్త కార్యదర్శిగా సంజయ్ కుమార్‌ను ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా శ్రీనివాస్‌చారి, ఉమాశంకర్ వ్యవహరించారు.


